
లక్ష్మీనరసింహస్వామికి రూ.35,62 లక్షల ఆదాయం
సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామికి హుండీల ద్వారా రూ.35,62,444 ఆదాయం సమ కూరింది. ఈ ఏడాది జూన్ 20 నుంచి సెప్టెంబర్ 11 వరకూ 83 రోజులకు గాను ఈ మొత్తం సమకూరింది. దేవదాయశాఖ జిల్లా అధికారి వి.సత్యనారాయణ పర్యవేక్షణలో అమలాపురం తనిఖీదారు జె.రామలింగేశ్వరరావు ఆధ్వర్యంలో గురువారం లెక్కింపు చేపట్టారు. మొత్తం ఆదాయంలో మెయిన్ హుండీల ద్వారా రూ.35,07,678, గుర్రాలక్క అమ్మవారి ఆలయ హుండీ నుంచి రూ.14,679, అన్నదానం హుండీల ద్వారా రూ.40,087 లభించినట్టు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ఎంకేటీఎన్‌వీ ప్రసాద్ తెలిపారు. అలాగే 4 గ్రాముల బంగారం, 39 గ్రాముల వెండి లభించిందన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ బైరా నాగరాజు, సర్పంచ్ కొండా జాన్ బాబు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
వినాయకునికి వెండి పళ్లెం సమర్పణ
అయినవిల్లి: అయినవిల్లి విఘ్నేశ్వరస్వామికి విశాఖపట్నం తగరపువలసకు చెందిన కటకం అవినాష్, సాహిత్య శృతి దంపతులు గురువారం వెండి పళ్లెం సమర్పించారు. 1050 గ్రాములు బరువైన ఈ పళ్లెం విలువ రూ.1,35,000 ఉంటుంది. దాతలు దీన్ని ఆలయ అర్చకుడు అయినవిల్లి సూర్యనారాయణమూర్తికి అందజేశారు. అనంతరం వారిని ఆలయ అర్చకులు, వేద పండితులు సత్కరించి, స్వామివారి శేష వస్త్రాలు, చిత్రపటం, ప్రసాదం అందజేశారు.