
కదలిన ఉద్యాన అధికారులు
పెరవలి: జిల్లాలో కంద రైతులు పడుతున్న పాట్ల గురించి ‘చేతికందని కష్టం’ శీర్షికన సాక్షి దినపత్రిలో ఈ నెల 7వ తేదీన కథనం వెలువడటంతో జిల్లా ఉద్యానవన ఽఅధికారులు స్పందించి పొలం బాట పట్టారు. మార్కెట్‌లో కంద పంటకు గిట్టుబాటు ధర లభించకపోవటం వలన ఎకరానికి రూ.2.25 లక్షలు నష్టపోవటంతో కంద రైతులు కంటిమీద కునుకులేకుండా ఉంటున్నారు. జిల్లా ఉద్యానవన పీడీ ఏ దుర్గేష్ పెరవలి మండలం అన్నవరప్పాడు గ్రామం వచ్చి కంద రైతు బొలిశెట్టి వెంకటేశ్వరరావుని కలసి కంద చేనుకు పెట్టుబడి, దిగుబడి, మార్కెట్టులో లభిస్తున్న ధరల గురించి ఆరా తీశారు. రైతుల సమస్యలు మార్కెటింగ్ శాఖకు వివరిస్తామని, కలెక్టర్ దృష్టికి తీసుకువెళతామని అధికారులు చెప్పారు. కందరైతులు ఇప్పటికే చాలా నష్టపోయామని అఽధికారులు పట్టించుకోకపోతే తీవ్ర నష్టాలు పాలవుతామని చెప్పారు. ఉద్యానవన అధికారి గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
బిక్కవోలు పోలీస్ స్టేషన్‌ను
ముట్టడించిన ఆందోళనకారులు
అనపర్తి : మహిళలపై దాడి చేసి గాయపరిచిన నిందితులను అరెస్టు చేసి కోర్టుకు తరలించకుండా అదుపులోకి తీసుకుని స్వేచ్ఛగా వదిలేశారని ఆరోపిస్తూ ఊలపల్లి గ్రామానికి చెందిన బాధిత వర్గానికి చెందిన వారు సోమవారం సాయంత్రం భారీగా తరలివచ్చి బిక్కవోలు పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు. ఈ నెల 6న వినాయక నిమజ్జనం సందర్భంగా జరిగిన గొడవలో మరో వర్గానికి చెందిన వారిపై అందిన ఫిర్యాదు మేరకు బిక్కవోలు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే రోజులు గడుస్తున్నా నిందితులపై చర్య లు తీసుకోకపోవడంతో పాటు వారిని స్వేచ్ఛగా వదిలేశారని ఆరోపిస్తూ బాధిత వర్గం వారు స్టేష న్ వద్దకు భారీగా చేరుకుని న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ప్రత్యేక పోలీసులతో ఆందోళనకారుల ను కట్టడి చేశారు. అనపర్తి సీఐ సుమంత్ ఆందోళ నకారులతో చర్చలు జరిపి నిందితులను అదుపులోకి తీసుకోవడంతో వివాదం సద్దుమణిగింది.
రుడా వైస్ చైర్మన్‌గా జేసీ
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (రుడా) వైస్ చైర్మన్‌గా జాయింట్ కలెక్టర్ వై.మేఘ స్వరూప్ సోమవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు రుడా చైర్మన్ బొడ్డు వెంకట రమణ, ఇతర అధికారులు అభినందనలు తెలిపారు.

కదలిన ఉద్యాన అధికారులు

కదలిన ఉద్యాన అధికారులు