
విలసాలాలకు అలవాటు పడి మోటారు సైకిళ్ల చోరీ
కోరుకొండ: మండలంలోని గాదరాడ గ్రామానికి చెందిన ముగ్గురు యువకులను 11 మోటారు సైకిళ్లతో కోరుకొండ పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. విలాసాలకు అలవాటు పడి రాజమహేంద్రవరం, కోరుకొండ, రాజానగరం, సీతానగరం పోలీస్ స్టేషన్‌ల పరిధిలో ఆ వాహనాలను వారు చోటీ చేసిన ట్లు నార్త్‌జోన్ డీఎస్పీ వై.శ్రీకాంత్ తెలిపారు. స్కూటీలను చోరీ చేయడం వీరు లక్ష్యంగా తీసుకుని తొమ్మి దింటిని చోరీ చేసినట్లు తెలిపారు. చోరీ చేసిన వాహనాలను గాదరాడలో అల్లాడి విజయ్ కుమార్ ఆద్వర్యంలో దాచేవారు. విజయ్‌కుమార్ అదే గ్రామానికి చెంది న వనుం సురేష్, వనుం లోవరాజులతో కలిసి ఈ వాహనాల చోరీకి పాల్పడ్డాడు. ఇటీవల కోరుకొండలో ని స్ప్లెండర్ ఫ్లస్ వాహనాన్ని చోరీపై పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు సోదాలు నిర్వహించగా 11 మోటార్లు సైకిళ్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఇంటి ముందు నిలిపిని మోటారు సైకిళ్లను చోరీ చేయడంలో వారు నిష్ణాతులని, నిందితులను రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరచనున్నట్టు ఆయన పేర్కొన్నారు. కేసు దర్యాప్తు అధికారిగా ఎస్సై కేవీ నాగార్జున ఉన్నారు. విలేకరుల సమావేశంలో కోరుకొండ సీఐ సత్య కిశోర్ పాల్గొన్నారు.