
చెడు వ్యసనాలకు లోనై చోరీలు
● పోలీసులకు చిక్కిన అంతర్రాష్ట్ర ముఠా
● 64 గ్రాముల బంగారం..
● 2.88 కేజీల వెండి వస్తువుల స్వాధీనం
రాజోలు: చెడు వ్యసనాలకు లోనై చోరీల బాట పట్టిన అంతర్రాష్ట్ర దొంగల ముఠా రాజోలు పోలీసులకు చిక్కారు. శుక్రవారం రాజోలు సర్కిల్ కార్యాలయంలో సీఐ టీవీ నరేష్‌కుమార్, క్రైమ్ సీఐ గజేంద్రకుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడుతున్న రాజోలు మండలం బి.సావరం గ్రామానికి చెందిన కట్టా అర్జున్, ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన సోదెం మంగప్రసాద్, రాజమహేంద్రవరానికి చెందిన షేక్ బాషి అలియాస్ బాషా, కాకినాడకు చెందిన షేక్ అజీజ్‌లను అరెస్ట్ చేసి రాజోలు కోర్టులో హాజరు పర్చారు. వీరిపై డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు పోలీస్‌స్టేషన్‌లో మూడు, ఆత్రేయపురం పోలీస్‌స్టేషన్‌లో ఒకటి, తూర్పుగోదావరి జిల్లా ఇరగవరం పోలీస్‌స్టేషన్‌లో ఒకటి, ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పోలీస్‌స్టేషన్‌లో రెండు, కొయ్యలగూడెం పోలీస్‌స్టేషన్‌లో ఒకటి, పెదవేగి పోలీస్‌స్టేషన్‌లో ఒకటి, తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా వీఎం బంజారా పోలీస్‌స్టేషన్‌లో ఒకటి మొత్తం 10 కేసులు ఉన్నాయి. వివిధ ప్రాంతాల్లో ఈ ముఠా చోరీ చేసి 64.106 గ్రాముల బంగారం, 2.859 కేజీల వెండి వస్తువులు, రూ. 2.80 లక్షలు నగదును పోలీసులు రికవరీ చేశారు. షేక్ అజీజ్ కాకినాడలోని ఒక నర్సింగ్ హోంలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేస్తూ విలాసాలకు అలవాటు పడి చోరీలకు అలవాటు పడ్డాడు. అజీజ్‌కు కట్టా అర్జున్, సోదెం మంగప్రసాద్‌లు రాజమండ్రి సెంట్రల్ జైలులో పరిచయమ్యారు. వీరిద్దరితో అజీజ్ దొంగతనాలు చేయిస్తూ, తను కూడా దొంగతనాలు చేసేవాడు. వీరు దొంగిలించిన చోరీ సొత్తును షేక్‌బాజీ విక్రయించేవాడు. అజీజ్‌పై ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సుమారు 75కు పైగా దొంగతనం కేసులు, కట్టా అర్జున్‌పై 10కి పైగా దొంగతనాలు కేసులు, షేక్ బాషిపై మారేడుమిల్లి పోలీస్‌స్టేషన్‌లో అక్రమ గంజాయి రవాణా కేసు నమోదు చేశారు. చోరీ కేసు చేధించిన రాజోలు సీఐ టీవీ నరేష్‌కుమార్, అమలాపురం సీసీఎస్ క్రైమ్ సీఐ ఎం. గజేంద్రకుమార్, ఎస్సైలు పరదేశి, ఎస్.రాజేష్‌కుమార్, ఏఎస్‌ఐ బాలకృష్ణ, క్రైమ్ హెచ్‌సీలు కె.రమణ, ఎం.రమేష్, పి.కిషోర్, ఎం.శేఖర్‌రాజు, కేవీ రమణ, కానిస్టేబుళ్లు బీఎన్‌వీఎస్‌ఎస్ రెడ్డి, ఆర్.శ్రీను, డి.అర్జున్, ఎం.హరిబాబు, జి.సాయి, బి.ప్రసాద్, ఎ.సుభాకర్, ఐ.శ్రీను, ఆర్.ప్రసాద్‌లను ఎస్పీ బీవీ కృష్ణారావు, డీఎస్పీ సుంకర మురళీమోహన్ అభినందించారు.