
7న వాడపల్లి ఆలయం మూసివేత
కొత్తపేట: చంద్రగ్రహణం సందర్భంగా ఈ నెల 7వ తేదీ మధ్యాహ్నం నుంచి ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ, భూ సమేత వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని మూసివేయనున్నట్టు దేవదాయ – ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. ఆ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. 7వ తేదీ ఆదివారం రాత్రి 9.55 గంటల నుంచి అర్థరాత్రి ఒంటి గంట వరకు చంద్రగ్రహణం సంభవిస్తుందని పేర్కొన్నారు. గ్రహణ సమయానికి ముందుగానే మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆలయాన్ని మూసివేయనున్నట్టు తెలిపారు. సోమవారం ఉదయం సంప్రోక్షణ అనంతరం 7.01 గంటలకు ఆలయాన్ని తెరిచి, భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తారని తెలిపారు.