నల్లజర్ల: వినాయక నిమజ్జన ఊరేగింపులో భాగంగా అశ్లీల నృత్యాలు చేయించిన నిర్వాహకులను పోలీసులు అరెస్టు చేశారు. తెలికిచెర్లలో వినాయక నిమజ్జనం, ఊరేగింపులో గత నెల 31వ తేదీన హిజ్రాలతో ట్రాక్టర్‌పై అశ్లీల నృత్యాలు చేయించి ప్రజలకు ఇబ్బంది కల్గించిన కమిటీ సభ్యులు రుద్రా శ్రీనివాస్, పాలూరి సుబ్బారావు, కోట వెంకట శ్రీనివాస్, చౌటుపల్లి చిన్ననరసయ్య, అడ్డాల సత్తిపండుపై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ దుర్గాప్రసాద్ విలేకరులకు తెలిపారు.
వీఆర్వో డి.శ్రీనివాస్ గురువారం ఇచ్చిన ఫిర్యాదుపై సెక్షన్ 292, 296, 50గా కేసు నమోదు చేసినట్టు చెప్పారు. ఈ సందర్భంగా సీఐ బాలశౌరి మాట్లాడుతూ ఊరేగింపులకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలన్నారు. తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఊరేగింపులలో ఎటువంటి అశ్లీల నృత్యాలు నిర్వహించరాదని, ప్రజలకు ఇబ్బంది కలిగేలా సౌండ్ సిస్టమ్‌లు పెట్టకూడదని, నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
.