
గణపతి నిమజ్జనాలకు పటిష్ట చర్యలు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): వినాయక విగ్రహాల నిమజ్జనాల సందర్భంగా జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకున్నట్టు ఎస్పీ డి.నరసింహ కిశోర్ అన్నారు. ఈ మేరకు బుధవారం జిల్లాలోని పోలీస్ అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. నిమజ్జన ఊరేగింపు మార్గాలను గూగుల్ మ్యాప్ ద్వారా పరిశీలించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ వినాయక ఉత్సవాల్లో ఆఖరి ఘట్టమైన నిమజ్జనాలు సజావుగా సాగేలా చర్యలు చేపట్టాలని పోలీసులకు సూచించారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా, ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చూడాలన్నారు. పోలీసులు నిర్దేశించిన నిమజ్జన రూట్‌లోనే ఊరేగింపు వాహనాలు వెళ్లాలన్నారు.