రామచంద్రపురం రూరల్: ద్రాక్షారామ మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామి ఆలయంలో శరన్నవరాత్ర (దసరా) మహోత్సవాలకు ఆలయ ఈఓ, దేవదాయ శాఖ సహాయ కమిషనర్ అల్లు వెంకట దుర్గాభవాని ఆధ్వర్యంలో గురువారం ఉదయం 9.15 గంటలకు రాట ముహూర్తం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ ఆలయంలో దసరా మహోత్సవాలను ఈ నెల 11వ తేదీ ఆదివారం నుంచి 23 శుక్రవారం వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్ పెంకే అన్నపూర్ణ, స్థానిక పెద్దలు పెంకే సాంబశివరావు, ఆళ్ల శివనారాయణ(బుజ్జి), దవులూరి రామకృష్ణ, దుళ్ల కొండయ్య, సంపతి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


