90 బస్తాల రేషన్‌ బియ్యం స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

90 బస్తాల రేషన్‌ బియ్యం స్వాధీనం

Oct 9 2026 12:14 AM | Updated on Oct 9 2026 12:14 AM

రావులపాలెం: నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్న రేషన్‌ బియాన్ని రెండు చోట్ల స్వాధీనం చేసుకుని, ముగ్గురిపై కేసులు నమోదు చేసినట్టు టౌన్‌ సీఐ జి.రమేష్‌ బాబు గురువారం తెలిపారు. వివరాల్లోకి వెళితే.. విశ్వసనీయ సమాచారం మేరకు సీఐ రమేష్‌ బాబు, ఎస్సై చంటి, సిబ్బందితో కలిసి జాతీయ రహదారిపై వాహనాలను తనిఖీ చేశారు. ఈ క్రమంలో రావులపాలెం జూనియర్‌ కళాశాల ఎదురుగా గోపాలపురం వైపు నుంచి వస్తున్న వ్యాన్‌లో 50 కిలోల చొప్పున 50 బస్తాల రేషన్‌ బియ్యం గుర్తించారు. దాని విలువ సుమారు రూ.50 వేలుగా అంచనా వేసి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో వాహన డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు. అలాగే జాతీయ రహదారిపై రావులపాడు వద్ద నిర్వహించిన తనిఖీలో పశ్చిమ గోదావరి జిల్లా వైపు నుంచి వస్తున్న వ్యాన్‌లో 50 కిలోల చొప్పున 40 బస్తాల రేషన్‌ బియ్యం పట్టుకున్నారు. దాని విలువ సుమారు రూ.40 వేలుగా అంచనా వేశారు. ఈ ఘటనలో ఇద్దరిపై కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement