యానాం: పట్టణ పరిధి కనకాలపేట గణపతి నగర్‌లోని కోలా రామకృష్ణ ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. రామకృష్ణ కుటుంబ సభ్యులు బుధవారం ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లారు. అర్ధరాత్రి సమయంలో దొంగలు ఆ తాళం పగలకొట్టి లోపలకు చొరబడ్డారు. బీరువాలోని ఐదు కాసుల బంగారు ఆభరణాలు, 200 గ్రాముల వెండి, రూ.2.15 లక్షలు అపహరించుకుపోయారు. గురువారం తిరిగి వచ్చిన రామకృష్ణ ఇంటి తాళం పగలకొట్టి ఉండడం గమనించి లోపలకు వెళ్లి చూడగా బీరువా తెరిచి ఉంది. దీంతో యానాం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు సంఘటనా స్థలానికి వచ్చిన బాధితుల నుంచి వివరాలు సేకరించారు.


