కొత్తపేట: స్టేట్ అడ్వొకేట్ షటిల్ బాడ్మింటన్ టోర్నమెంట్ సింగిల్స్‌లో కొత్తపేట బార్ అసోసియేషన్ సభ్యుడు, లాయర్ పప్పుల సంజయ్‌నాయుడు రన్నర్‌గా నిలిచారు. విజయవాడలో ది బెజవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు ఈ పోటీలు జరిగాయి. సింగిల్ ఫైనల్స్‌లో పి.గన్నవరం మండలం పప్పులవారిపాలెం గ్రామానికి చెందిన సీనియర్ న్యాయవాది, కొత్తపేట బార్ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ పప్పుల వెంకటరామదొర కుమారుడు, యువ న్యాయవాది సంజయ్‌నాయుడు ద్వితీయ స్థానంలో నిలిచారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య నుంచి ట్రోఫీ ఆదివారం రాత్రి అందుకున్నారు. సంజయ్‌నాయుడును బార్ ప్రెసిడెంట్ మద్దింశెట్టి వీవీఎస్ ప్రసాద్, మాజీ ప్రెసిడెంట్ సత్యవాడ సందీప్‌కుమార్, సీనియర్ న్యాయవాదులు ఎన్.మోహన్‌రావు, జీపీ నాయుడు, పద్మాజీరావు, బండారు రామకృష్ణ, వైవీఆర్, ఎస్‌వీఆర్, కురచ బాల సుబ్రహ్మణ్యం తదితరులు అభినందించారు.


