ప్రోత్సహిస్తే ఉన్నత స్థాయికి యువత | - | Sakshi
Sakshi News home page

ప్రోత్సహిస్తే ఉన్నత స్థాయికి యువత

Oct 6 2026 12:12 AM | Updated on Oct 6 2026 12:12 AM

● ‘నో యువర్‌లీడర్‌’లో పాల్గొన్న భవ్య శ్రీ

● విద్యార్థిని సత్కరించిన

కలెక్టర్‌ మహేష్‌ కుమార్‌

అమలాపురం రూరల్‌: ప్రతిభ కలిగిన యువతను ప్రోత్సహిస్తే భారతదేశ నాయకత్వ నిర్మాణంలో ఉన్నత స్థాయికి చేరుతారని కలెక్టర్‌ మహేష్‌ కుమార్‌ పేర్కొన్నారు. పార్లమెంటరీ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ డెమోక్రసీస్‌ ఆధ్వర్యంలో జరిగిన ‘నో యువర్‌ లీడర్‌’ కార్యక్రమంలో పాల్గొన్న అమలాపురం సమనస జిల్లా ప్రజా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థిని ఉండ్రాజవరపు భవ్య శ్రీని కలెక్టరేట్‌లో సోమవారం అభినందించి సత్కరించారు. అక్టోబర్‌ 2న న్యూఢిల్లీ పార్లమెంట్‌ కాంప్లెక్స్‌లోని సంవిధాన్‌ సదన్‌ సెంట్రల్‌ హాల్‌లో జాతీయ నాయకుల జయంతి వేడుకలు నిర్వహించినట్టు కలెక్టర్‌ తెలిపారు. దేశవ్యాప్తంగా ఎంపికై న యువతతో కలిసి పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో జాతీయ నాయకులను స్మరించుకునే అరుదైన అవకాశం భవ్య శ్రీకి లభించడం గర్వకారణమన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు, జాతీయ నాయకుల ఆదర్శాలు, ప్రజాస్వామ్య విలువలపై యువతలో అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా లోక్‌సభ సచివాలయం ఈ కార్యక్రమాన్ని నిర్వహించిందని మహేష్‌ కుమార్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement