వలంటీర్లకు చంద్రబాబు వెన్నుపోటు | - | Sakshi
Sakshi News home page

వలంటీర్లకు చంద్రబాబు వెన్నుపోటు

Oct 5 2026 12:27 AM | Updated on Oct 5 2026 12:27 AM

వలంటీర్లకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. ఎన్నికల ముందు రూ.పది వేల జీతాలు ఇస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చాక మొత్తానికే తొలగించారు. నిరుద్యోగ భృతి ఇస్తామని మోసం చేశారు. సొంత ప్రచారం చేసుకోవడానికి సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల పేరుతో రూ.లక్షలు ఖర్చు చేసేందుకు నిర్ణయాలు తీసుకోవడం దారుణం. కరోనా వంటి విపత్కర సమయాల్లో వలంటీర్లు ప్రాణాలకు తెగించి సేవలందించారు. ఇప్పుడు మమ్మల్ని తొలగించడం దారుణం.

–శైలజ, మాజీ వలంటీర్‌, పులిదిండి, ఆత్రేయపురం మండలం

కుట్ర చేయడం దారుణం

కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల విధానంతో ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో నెలకు రూ.5 వేల గౌరవ వేతనంతోనే వలంటీర్లు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికి చేరవేశారు. రేషన్‌ దగ్గర నుంచి పింఛన్ల వరకు అన్ని పథకాలను ప్రజలకు అందించారు. అలాంటి మమ్మల్ని తొలగించి, ఇప్పుడు సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు రూ.లక్షలు ఇచ్చేందుకు కుట్ర చేయడం దారుణం.

– మట్టపర్తి వెంకటేశ్వర్లు, మాజీ వలంటీర్‌, పి.మల్లవరం, తాళ్లరేవు మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement