సీ్త్రశక్తి పథకం అమలు నేపథ్యంలో ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం తీవ్ర అసౌకర్యంగా, కొన్ని సందర్భాల్లో ప్రాణసంకటంగా మారుతోంది. ప్రయాణికుల రద్దీలో వృద్ధులు, చిన్న పిల్లలు నలిగిపోతున్నారు. పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కడంతో గమ్యస్థానాల్లో దిగేందుకు వీలు లేకుండా ఉంటుంది. ప్రతి రూటులోనూ కొత్త సర్వీసులు వేయాలి.
– సాకా జానకిరామరాజు, కార్యదర్శి, వైఎస్సార్ సీపీ న్యాయ విభాగం, వానపల్లి
టెండర్ల దశలో ఎలక్ట్రిక్ బస్సులు
ప్రయాణికుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో ఆర్టీసీకి ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి. మొదటి విడతలో కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాలకు 50 చొప్పున కేటాయించగా, రెండో విడతలో కోనసీమ జిల్లాకు సంబంధించి రావులపాలెం డిపోకు 45 బస్సులు ప్రతిపాదించారు. ఈ ప్రక్రియ ప్రస్తుతం టెండర్ల దశలో ఉంది. అవకాశం ఉన్నంత వరకు ప్రతి స్టేజ్‌లోనూ ప్రయాణికులను ఎక్కించుకుంటున్నారు.
– జి.సత్యనారాయణ, ఆర్‌ఎం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా
బస్సుల సంఖ్య పెంచాలి
ప్రభుత్వం అమలు చేస్తున్న సీ్త్రశక్తి ఉచిత బస్సు పథకం అమల్లోకి వచ్చాక విపరీతంగా రద్దీ పెరిగిపోయింది. ముఖ్యంగా వాడపల్లి వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల రూట్లలో భక్తుల సంఖ్య మరింత పెరిగింది. అందుకు అనుగుణంగా బస్సులు పెంచకపోవడంతో ప్రయాణికులు, సిబ్బందికి మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడుతోంది. బస్సులు పెంచడంతో పాటు సిబ్బంది ఖాళీలను రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయాలి.
– గిడ్ల చిరంజీవి, విజయవాడ జోన్ ప్రెసిడెంట్, ఎంప్లాయీస్ యూనియన్, రాజమహేంద్రవరం
●


