వాడపల్లి వాసా! చందన స్వరూపా! | - | Sakshi
Sakshi News home page

వాడపల్లి వాసా! చందన స్వరూపా!

Oct 4 2026 9:37 AM | Updated on Oct 4 2026 9:37 AM

వెంకన్న దర్శనానికి తరలివచ్చిన అశేష భక్త జనం

ఆత్రేయపురం : కోనసీమ తిరుమల వాడపల్లి చందన స్వరూపుడు, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శ నానికి శనివారం అశేష భక్తజనం విచ్చేశారు. భక్తు ల గోవింద నామ స్మరణలతో మాడవీధులు మారు మోగాయి. భక్తులు ఏడు ప్రదక్షిణలు చేసి ఏడేడు జన్మల పుణ్యఫలంగా భావించారు. స్వామివారిని సుమారు లక్షకు పైగా భక్తులు శనివారం దర్శించారని, భారీ ఆదాయం కూడా సమకూరిందని ఆలయ ఈవో, దేవదాయ శాఖ ఉప కమిషనర్‌ నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. వాడపల్లి శ్రీ వెంకటేశ్వరస్వామివారిని తెల్లవారుజాము నుంచి భక్తులు వివిధ రాష్ట్రాలు, సుదూర ప్రాంతాల నుంచి వాడపల్లికి విచ్చేసి స్వామిని దర్శించారు. పెద్ద సంఖ్యలో భక్తులు కాలినడకన సైతం స్వామి వారికి దర్శనానికి విచ్చేశారు. ఆలయంలో వేకువ జామునే సుప్రభాత సేవ, తొలి హారతి, నిరాజనం, ఐశ్వర్య లక్ష్మి హోమం, బాల భోగం వంటి కార్యక్రమాలను ఆలయ అర్చకులు, వేద పండితులు ఆగమ శాస్త్రానుసారం నిర్వహించారు. స్వామివారిని ప్రత్యేకంగా సహజమైన పలు రకాల పూలతో, మొక్కజొన్న పొత్తులతో కనులపండువగా అలంకరించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఉచిత అన్న ప్రసాదం, తీర్థప్రసాదాలు స్వీకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement