ప్రజల సొమ్ము పచ్చనేతలకు దోచిపెట్టడానికే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల పేరు చెప్పి ప్రభుత్వం సొంత డప్పు కొట్టుకోవాలని చూస్తుంది. ఎన్నికల ముందు వలంటీర్లకు రూ.పది వేల జీతం ఇచ్చి కొనసాగిస్తామని చెప్పిన చంద్రబాబు, ఇప్పుడు మమ్మల్ని మోసం చేశారు. నిరుద్యోగ భృతి ఇస్తామని మొండిచేయి చూపారు. కరోనా వంటి విపత్కర సమయంలో ప్రాణాలకు తెగించి సేవలు అందించాం. మా పొట్ట కొట్టి, ప్రభుత్వ సొమ్ము దుబారా చేయడం దారుణం.
– అనురాధ, మాజీ వలంటీర్, పులిదిండి, ఆత్రేయపురం మండలం
చంద్రబాబుకు డప్పు కొడితే డబ్బులిస్తారా?
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో వలంటీర్ల ద్వారా ప్రజల ఇంటికే సంక్షేమ పథకాలు అందాయి. నేడు సీఎం చంద్రబాబుకు, ఆయన కూటమికి డప్పు కొడితే డబ్బులిస్తామంటున్నారు. ఇదేం విధానం. అప్పట్లో వలంటీర్లకు కేవలం రూ.5 వేలు ఇస్తేనే ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని ఎల్లో మీడియా దుష్ప్రచారం చేసింది. ఇప్పుడు రూ.లక్షల సొమ్ము టీడీపీ, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు దోచిపెట్టేందుకు రంగం సిద్ధం చేయడాన్ని ఏమంటారు.
– పోతుల మనోజ్‌కుమార్, మాజీ వలంటీర్, గంటి, కొత్తపేట మండలం


