దగా డీఎస్సీపై ధ్వజం | - | Sakshi
Sakshi News home page

దగా డీఎస్సీపై ధ్వజం

May 30 2026 12:17 AM | Updated on May 30 2026 12:17 AM

వైఎస్సార్‌ సీపీ విద్యార్థి పోరు కార్యక్రమంలో అర్ధనగ్న ప్రదర్శన

అంబేడ్కర్‌ విగ్రహానికి వినతి పత్రం

అందజేత

అమలాపురం రూరల్‌: విద్యార్థులను మెగా డీఎస్సీ పేరుతో మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వైఎస్సార్‌ సీపీ విద్యార్థి పోరు కార్యక్రమంలో అర్థనగ్న ప్రదర్శన నిర్వహించి అంబేడ్కర్‌ విగ్రహనికి వినతిపత్రం అందించారు. వైఎస్సార్‌ సీపీ కోనసీమ జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు మిండగుదిటి శిరీష్‌, ఉభయగోదావరి జిల్లాల విద్యార్థి విభాగం రీజినల్‌ కో ఆర్డినేటర్‌ జిల్లెల్ల రమేష్‌ ఆధ్వర్యంలో అమలాపురం మండలం జనుపల్లి మన్నా కాలనీ వద్ద అంబేడ్కర్‌ విగ్రహం వద్ద శుక్రవారం విన్నూతంగా నిరసన తెలిపారు. విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు శిరీష్‌ మాట్లాడుతూ మెరిట్‌ లిస్టులు బయట పెట్టకుండా, బయట వారికి పోస్టులు అమ్ముకోవడం చాలా దారుణం అని అన్నారు. ఎవరైతే పరీక్ష పత్రాలు తయారు చేశారో వారిని ఎందుకు విధుల నుంచి తొలగించారని ప్రశ్నించారు. హఠాత్తుగా మెగా డీఎస్సీకి సంబంధించిన ఉన్నత అధికారిని ఎందుకు బదిలీ చేశారో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ యువతకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. మెరిట్‌లో సెలెక్ట్‌ అయిన వారికి న్యాయం జరగకపోతే రానున్న రోజుల్లో ఉద్యమం మరింత ఉధృతంగా చేస్తామని అన్నారు. లోకేష్‌ వెంటనే రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. జిల్లా వైఎస్సార్‌ సీపీ విద్యార్థి సంఘాల ఉపాధ్యక్షుడు పందిరిపల్లి అమర్‌కుమార్‌, విద్యార్థి సంఘాల నాయకులు బడుగు మోహన్‌, దొమ్మేటి అర్జున్‌, లీలా ప్రసాద్‌, కరుణ సాయి, మాదిరెడ్డి లోవరాజు, రైనా, గుత్తాల రాజమోహన్‌, నియోజకవర్గం విద్యార్థి సంఘాల నాయకులు గంటి ఆకాష్‌, గొల్లపల్లి రాజశేఖర్‌, గంటా వీరేష్‌, మట్ట నాని, మండల విద్యార్థి సంఘాల నాయకులు ఉండ్రు వినోద్‌, రాష్ట్ర నాయకులు మందశెట్టి ప్రసాద్‌ నాయకులు పాల్గొని నిరసన తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement