ఐపీఎల్‌ ఫీవర్‌! | - | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌ ఫీవర్‌!

May 28 2026 12:22 AM | Updated on May 28 2026 12:22 AM

పల్లెల్లో సైతం అదే క్రేజ్‌

క్రికెట్‌కు పల్లెల్లో సైతం క్రేజ్‌కు తక్కువేమీ లేదు. చిన్న పిల్లలు సైతం బ్యాట్‌, బాల్‌, మూడు నాలుగు కర్రముక్కలు పట్టుకుని మైదానాల బాట పడుతున్నారు. పగటి పూట మైదానంలో సాధన.. రాత్రి పూట టీవీల్లో ఐపీఎల్‌ వీక్షణగా సాగుతున్నాయి పల్లె యువత వేసవి సెలవులు. క్రీడల ప్రోత్సాహానికి చిన్నారుల కోసం ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తే నాణ్యమైన క్రీడాకారులు వెలుగులోకి వస్తారు.

– ముత్యాల పవన్‌ కిశోర్‌, పీడీ,

జెడ్పీ ఉన్నత పాఠశాల, ముక్కామల

పగలు సాధన.. రాత్రి వీక్షణ..

పల్లెల్లో సందడి చేస్తున్న యువత

ఉత్సాహంగా వేసవి సెలవులు

కొత్తపేట: కళ్లు చెదిరే ఫోర్లు.. ఆకాశాన్నంటే సిక్సులు.. మిరుమిట్లు గొలిపే లేజర్‌ షో.. చీర్‌ గళ్స్‌ చిందులు.. ప్రపంచ క్రికెట్‌లో మేటి ఆటగాళ్ల ఏకై క వేదిక ఐపీఎల్‌. ప్రపంచంలో ఏ క్రీడకూ లేని క్రేజ్‌ క్రికెట్‌ సొంతం. ఐపీఎల్‌ 19వ సీజన్‌ చివరి అంకానికి చేరింది. అభిమాన జట్ల విజయాలు.. అభిమాన క్రికెటర్ల బ్యాటింగ్‌, బౌలింగ్‌ ప్రతిభకు ఈలలు, చప్పట్లు, అరుపులు కేకలతో మజాను ఆస్వాదిస్తున్నారు.

వేసవి సెలవుల్లో..

పదో తరగతి, ఇంటర్‌ పరీక్షల ఫలితాలు వెలువడ్డాయి. మార్చి నెలాఖరులో ఐపీఎల్‌ ప్రారంభమైంది. అన్నీ కలిసొచ్చాయి. క్రికెట్‌ కిట్లు తీశారు.. ఉదయం నుంచి సాయంత్రం వరకు మైదానాల్లో టీమ్‌లుగా విడిపోయి క్రికెట్‌ మ్యాచ్‌లు. రాత్రి ఇళ్లలో ఐపీఎల్‌ మ్యాచ్‌ల సందడి.

Advertisement
 
Advertisement
Advertisement