పీజీఆర్‌ఎస్‌కు 178 అర్జీలు | - | Sakshi
Sakshi News home page

పీజీఆర్‌ఎస్‌కు 178 అర్జీలు

Apr 7 2026 7:31 AM | Updated on Apr 7 2026 7:31 AM

అమలాపురం రూరల్‌: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు 178 అర్జీలు సమర్పించార. వారి నుంచి కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌, ఆర్‌డీఓ మమ్మీ, డీఎల్‌డీఓ అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ప్రతి అర్జీకి నిర్దిష్ట గడువు లోగా నాణ్యమైన పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి దుర్గారావుదొర, డీసీహెచ్‌ఎస్‌ కార్తీక్‌రెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ రాజన్‌, దేవదాయ శాఖ సహాయ కమిషనర్‌ వి.సత్యనారాయణ, జిల్లా పౌర సరఫరాల అధికారి అడపా ఉదయ భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement