నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): జిల్లా లాన్ టెన్నిస్ సంఘం ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా క్రీడామైదానంలోని సింథటిక్ టెన్నిస్ కోర్టులలో మూడు రోజులుగా జరుగుతున్న జిల్లా స్థాయి లాన్ టెన్నిస్ పోటీలు ఆదివారం ముగిశాయి. ఏపీ లాన్ టెన్నిస్ సంఘ కార్యదర్శి పీవీ రామకుమార్ ఆధ్వర్యాన అండర్–12, 14, 16, బాలురు, బాలికలు, పురుషులు, మహిళల విభాగాల్లో నిర్వహించిన ఈ పోటీల్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. జిల్లా క్రీడాభివృద్ధి అధికారి (డీఎస్‌డీఓ) వి.సతీష్‌కుమార్ ముఖ్య అతిఽథిగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. గౌరవ అతిథిగా డాక్టర్ గిరి పాల్గొన్నారు.
విజేతల వివరాలు
అండర్–12 బాలుర విభాగంలో అరవింద్ విజేతగా నిలువగా, బాలికల విభాగంలో బ్రాహ్మిణి, అద్విత్య మొదటి రెండు స్థానాలు అందుకున్నారు. అండర్–14 బాలుర విభాగంలో ప్రతీక్, తనిష్‌లు, బాలికల విభాగంలో బ్రాహ్మిణి, విందా, అండర్–16 బాలుర విబాగంలో ప్రతీక్, నిఖిలేష్, బాలికల విభాగంలో మానివి, ఆశ్రయ మొదటి రెండు స్థానాలు గెలుపొందారు.


