మహాత్మాగాంధీ పేరు తొలగించటం దుర్మార్గం
● ఉపాధి హామీ చట్టం స్ఫూర్తిని
దెబ్బతీస్తున్నారు
● సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు
సుబ్బారావు
● కలెక్టరేట్ వద్ద వామపక్షాలు,
దళిత ప్రజా సంఘాల ధర్నా
అమలాపురం రూరల్: జాతీయ ఉపాధి హామీ చట్టం స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని, మహాత్మాగాంధీ పేరును తొలగించి జీరామ్‌జీ అనే పేరు చేర్చే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ిసీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు దడాల సుబ్బారావు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ వద్ద వామపక్షాలు, దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా సోమవారం ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి సుబ్బారావు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉపాధి హామీ చట్టాన్ని ఎలా నిర్వీర్యం చేయాలా అని ఆలోచిస్తూ ఉందని, చివరకు ఆ పథకాన్ని రద్దు చేయడానికి సరికొత్త స్కీమును ప్రవేశపెట్టిందని అన్నారు.
ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయడమే పనిగా పెట్టుకుని ప్రతి బడ్జెట్‌లో నిధుల కోత పెడుతూ, జీ రామ్‌జీ పేరు చేర్చి మతపు రంగు పులిమే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి దేవ రాజేంద్రప్రసాద్, సీపీఎం జిల్లా కన్వీనర్ కారెం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 125 రోజులకు పని పెంచినట్లు కేంద్రం చెబుతున్నా అందుకు తగ్గ నిధులను కేటాయించలేదన్నారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు జి. దుర్గాప్రసాద్, ఎన్.బలరాం, కేవీపీఎస్ జిల్లా కన్వీనర్ శెట్టిబత్తుల తులసిరావు, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి పీతల రామచంద్రరావు, సీపీఐ నాయకులు చెల్లుబోయిన తాతారావు, దొండపాటి గట్టురాజు, డి భానోజీ, డి చిట్టిబాబు, వి చిట్టిబాబు, పౌర హక్కుల ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కార్యదర్శి అమలుదాసు బాబురావు, జిల్లెల్ల మనోహర్ మాల మహానాడు జిల్లా నాయకులు గిడ్ల వెంకటేశ్వరరావు, పీడీఎస్‌యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేవు తిరుపతిరావు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు లక్ష్మణ్, వీర ప్రసాద్, ఉండవల్లి గోపాలరావు పాల్గొన్నారు.


