జీతాలు ఇవ్వాలని నైట్ వాచ్‌మన్‌ల ధర్నా
అమలాపురం రూరల్: ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న నైట్ వాచ్‌మన్లకు మూడు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని, పదిరోజులు పొతే నాలుగు నెలలు పూర్తి అవుతాయి అని కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా చేశారు. సీఐటీయూ అధ్యక్ష, కార్యదర్శులు ఎ. దుర్గాప్రసాద్, నూకల బలరామ్ మాట్లాడుతూ జీతా లు లేకపోతే వారికి కుటుంబాలను ఏ విధంగా పోషించుకోవాలో అర్థం కావడం లేదన్నారు. అధికారులు వెంటనే స్పందించి వారికి రావాల్సిన పెండింగ్ జీతా లు ఇచ్చేలా ప్రయత్నం చేయాలని అన్నారు. కలెక్టర్‌కు నైట్ వాచ్మెన్లు సంఘం నాయకులు రాంబాబు, బాలాజీ, శ్రీనివాస్ సత్యం వినతి పత్రాన్ని అందించారు.


