
శుక్రవారం శ్రీ 19 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
లో
అక్రమ కేసులు సిగ్గుచేటు
ప్రజాస్వామ్యంలో ఎన్నడూ లేని విధంగా కూటమి సర్కార్ నీచ సంస్కృతికి నాంది పలుకుతోంది. విలేకర్ల సమావేశంలో టీడీపీ నేతల అక్రమాల గురించి మాట్లాడితే.. పత్రిక పైన, సాక్షి ఎడిటర్, పాత్రికేయులపై కేసులు పెట్టడం సిగ్గుచేటు. పత్రికా స్వేచ్ఛను హరిస్తూ.. రాజ్యాంగ విలువలను కూటమి పాలకులు కాలరాస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలను తెలుగు ప్రజలకు వివరించడమే విలేకర్లు చేసిన తప్పా? సాక్షి ఎడిటర్, పాత్రికేయులపై కేసులు తక్షణం ఎత్తివేయాలి.
– చందన నాగేశ్వర్, మాజీ చైర్మన్, ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్
పత్రికా స్వేచ్ఛను హరించడం సరికాదు
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారథిగా పని చేస్తున్న మీడియా రంగాన్ని అణచివేసేలా కూటమి ప్రభుత్వం చేపడుతున్న చర్యలు సరికాదు. గతంలో ఏ ప్రభుత్వంలోనూ ఇలాంటి పరిస్థితులు లేవు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా.. చేస్తున్న మోసాలను, వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తోందనే కక్షతో సాక్షి ఎడిటర్, పాత్రికేయులపై అక్రమంగా కేసులు పెట్టడం దారుణం. ఈ అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలి.
– ఆకుల వీర్రాజు, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) మాజీ చైర్మన్
8

శుక్రవారం శ్రీ 19 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025

శుక్రవారం శ్రీ 19 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025