
పత్రికా స్వేచ్ఛ
పత్రికా స్వేచ్ఛను హరించేలా కూటమి ప్రభుత్వం వ్యవహరించడం అన్యాయం. పత్రికలు, ఎడిటర్లు, జర్నలిస్టులపై కక్షపూరిత చర్యలకు పాల్పడడం సరికాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికల ద్వారా ఎంతో మంది తమ అభిప్రాయాలను ధైర్యంగా చెబుతారు. వార్తలు తప్పు అని భావిస్తే వాటిని ఖండించాలి. ప్రస్తుతం రాష్ట్రంలో ఏదైనా నిజం చెప్పినా, దానిని ప్రచురించినా కేసులు పెట్టే సంస్కృతి ఎక్కువైంది. ఇలాగే సాక్షి పత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిపై కేసు పెట్టడం అత్యంత దుర్మార్గం.
– గొల్లపల్లి సూర్యారావు, మాజీ మంత్రి
మీ తప్పిదాలపై వార్తలు రాస్తే కేసులా?
కూటమి ప్రభుత్వం చేస్తున్న వరుస తప్పిదాలపై వార్తలు రాస్తే పోలీసు కేసులు పెట్టి వేధిస్తారా?, ఇదెక్కడి దారుణం. సాక్షి పత్రిక ఎడిటర్ ఆర్.ధనుంజయరెడ్డిపై కేసులు పెట్టడం చూస్తుంటే ఈ కూటమి ప్రభుత్వం విధానపరంగా కాకుండా కక్ష సాధింపు ధోరణిలోనే వెళుతోందని అనిపిస్తోంది. దీనిని కూటమి ప్రభుత్వం అనడం కన్నాకుట్ర, కుతంత్రాల ప్రభుత్వం అంటేనే బాగుంటుంది.
– పినిపే విశ్వరూప్, మాజీ మంత్రి, అమలాపురం