కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లి వేంకటేశ్వరస్వామిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కిరణ్మయి మండవ మంగళవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేశారు. స్వామివారి దర్శనానంతరం పండితులు ఆశీర్వదించి, తీర్థప్రసాదాలు, సిబ్బంది, అర్చకులు స్వామివారి చిత్రపటం అందజేశారు.
సమగ్ర శిక్షా ఏపీసీగా మమ్మీ
అమలాపురం రూరల్: సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్(ఏపీసీ)గా జి.మమ్మీ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకూ డీఈఓ షేక్ సలీం బాషా ఏపీసీగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన స్థానంలో మమ్మీని పూర్తి స్థాయి ఏపీసీగా నియమిస్తూ సమగ్ర శిక్షా రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు ఉత్తర్వులు ఇచ్చారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం మమ్మీ జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి, డీఈఓ బాషాను మర్యాద పూర్వకంగా కలిశారు. సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో అమలవుతున్న కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా చెప్పారు.

వెంకన్న సన్నిధిలో జస్టిస్ కిరణ్మయి