కామాంధుడు.. ఆసుపత్రి గదిలోకి చొరబడి... | Young Woman Molested At Mysore Hospital | Sakshi
Sakshi News home page

దారుణం: మతిస్థిమితం లేని యువతిపై లైంగిక దాడి

Published Sun, Jul 11 2021 7:00 AM | Last Updated on Sun, Jul 11 2021 7:06 AM

Young Woman Molested At Mysore Hospital - Sakshi

మైసూరు(కర్ణాటక): మతిస్థిమితం లేని యువతి (30)పై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన మైసూరు కేఆర్‌ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. వివరాలు... శుక్రవారం రాత్రి ఆస్పత్రి కిటికీ గ్రిల్స్‌ విరగ్గొట్టి గదిలోకి చొరబడిన కామాంధుడు అనారోగ్యంతో చికిత్స పొందుతున్న నిస్సహాయ యువతిపై లైంగికదాడికి పాల్పడి పారిపోయాడు. విషయాన్ని ఆమె బంధువులు వైద్యుల దృష్టికి తీసుకువచ్చినా ఆస్పత్రికి చెడ్డపేరు వస్తుందని దాచిపెట్టాలని యత్నించారని వారు తెలిపారు.

మానవ హక్కుల సేవా సమితి సభ్యులు విషయం తెలుసుకుని వైద్యులను ప్రశ్నించగా సమాధానం చెప్పలేదు. ఎక్కడా బయట చెప్పొద్దని ఆస్పత్రి సిబ్బందిని వైద్యులు బెదిరించినట్లు ఆరోపించారు. ఈ ఘటనతో అక్కడే విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది పారిపోయారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement