ఆరు నెలలుగా పుట్టింట్లోనే.. అయినా వదలని భర్త, అత్తమామలు

Young Woman Lost Life After Dowry harassment In karnataka - Sakshi

మైసూరు జిల్లాలో ఘోరం.. కట్నపిశాచికి యువతి బలి

మైసూరు: కట్న పిశాచుల వేధింపులను భరించలేక ఓ అబల ఆత్మహత్య చేసుకుంది. నంజనగూడు తాలూకాలోని బిళిగెరె గ్రామానికి చెందిన సౌమ్యా (26)కి మూడేళ్ల కిందట మైసూరుకు చెందిన గౌతమ్‌ అనే వ్యక్తితో పెళ్లయింది. మరింత కట్నం తీసుకురావాలని ఆమెను భర్త అత్తమామలు వేధించడంతో తట్టుకోలేక ఆరునెలల క్రితం పుట్టింటికి వచ్చేసింది. కట్నం తీసుకుని వస్తేనే రావాలని భర్త, అత్తమామలు ఒత్తిడి చేయడంతో జీవితంపై విరక్తి చెందింది. వారు కోరినట్లు మూడు లక్షల నగదు, బంగారం ఇచ్చే పరిస్థితి లేదని నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుంది. ఆమె తల్లిదండ్రులు బిళగెరె పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   

కిరాతక టెక్కీ
మైసూరు: అదనపు కట్నం తేవాలని భార్యను కొట్టాడో టెక్కీ. ఆమె ఫిర్యాదుతో పోలీసులకు అతిథిగా వెళ్లాడు. మానస గంగోత్రికి చెందిన విశాలాక్షమ్మ, యశోదరాచార్‌ దంపతుల కుమారుడు ఆనంద్‌కు మూడేళ్ల కిందట మైసూరుకే చెందిన రమ్యతో ఘనంగా పెళ్లి చేశారు. బంగారంతో పాటు భారీగా కటా్నన్ని ఇచ్చారు. తరువాత బెంగళూరు ఉద్యోగం చేస్తూ అక్కడే కాపురం ఉండేవారు.

రమ్య గర్భవతి కావడంతో మైసూరులో పుట్టింటికి చేరుకుంది. ఆనంద్‌కు ఖతార్‌ దేశంలో కొన్నాళ్లు ఉద్యోగం చేసి వచ్చాడు. రమ్యకు ఆడబిడ్డ పుట్టింది.  ఈ నెల 2న రమ్య తన తండ్రిని తీసుకుని అత్తవారింటికి వెళ్లగా అదనపు కట్నం తెస్తేనే ఇంట్లోకి రానిస్తామని భర్త అత్తమామలు తెగేసి చెప్పారు. అంతేకాకుండా ఆమెపై పైశాచికంగా దౌర్జన్యం కూడా చేయడంతో చంటిపాప  కన్నుకు, ముక్కుకు గాయాలు తగిలాయి. రమ్య మైసూరు మహిళా పోలీసులకు ఫిర్యాదు చేయగా ఘరానా భర్తను అరెస్టు చేసి విచారణ చేపట్టారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top