
ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందిన యువకుడు
నిజామాబాద్: క్రికెట్ ఆడేందుకు వెళ్లిన ఓ యువకుడు ఆట మధ్యలోనే గుండెపోటుతో కుప్పకూలిన ఘటన నగరంలోని వినాయక్‌నగర్‌లో ఉన్న అమ్మవెంచర్‌లో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.
నగరంలోని గౌతమ్‌నగర్‌కు చెందిన విజయ్(30) తన స్నేహితులతో కలిసి అమ్మవెంచర్‌లో ఉన్న క్రికెట్ మైదానానికి వచ్చాడు. అక్కడ క్రికెట్ ఆడుతుండగా గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలాడు. గమనించిన స్నేహితులు వెంటనే జీజీహెచ్‌కు తరలించారు. పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు తెలిపారు.
విజయ్ మృతితో కుటుంబీకులు, స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కాలనీలో విషాదచాయలు అలుముకున్నాయి. ఈ విషయమై నాలుగో టౌన్ ఎస్సై సంజీవ్‌కు వివరణ కోరగా ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.
ఇవి చదవండి: Low blood pressure : ఈ చిట్కాలను పాటిస్తే మేలు!