ఆన్‌లైన్‌ లోన్‌ యాప్‌ వేధింపులతో యువకుడి ఆత్మహత్య

Young Man Ends His Life With Online Loan App Harassment hyderabad - Sakshi

సాక్షి, జియాగూడ: ఆన్‌లైన్‌ యాప్‌లలో యువత రుణాలు తీసుకొని తిరిగి చెల్లించలేని పరిస్థితుల్లో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. లోన్లు తీసుకునే సమయంలో ఇచ్చే రెఫరెన్స్‌ నంబర్లకు మెసేజ్‌లు పెడుతుండటంతో అవమాన భారం భరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. జియాగూడ న్యూ గంగానగర్‌లోని రాజ్‌కుమార్‌ యాదవ్‌(22) ప్రముఖ కార్ల కంపెనీలో డ్రైవర్‌ కమ్‌ డెలివరి బాయ్‌.

దాంతోపాటు జియాగూడ మేకలమండిలో చిరు వ్యాపారం చేసుకుంటున్నాడు. ఇటీవల ఆన్‌లైన్‌ లోన్‌ యాప్‌లో రూ.12 వేల రుణం పొందినట్లు బంధువులు తెలిపారు. బకాయిలు చెల్లించలేదని లోన్‌ యాప్‌ నిర్వహకులు తీవ్రంగా ఇబ్బంది పెట్టడంతో పాటు స్నేహితులకు మెసేజ్‌లు పెడుతున్నారు. దీంతో మనోవేదనకు గురైన రాజ్‌కుమార్‌ యాదవ్‌ ఆదివారం తెల్లవారు జామున ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top