వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని మహిళ దారుణం | Woman Kills Son Over Extramarital Affai In Nizamabad | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని మహిళ దారుణం

Apr 12 2022 2:20 PM | Updated on Apr 13 2022 12:51 PM

Woman Kills Son Over Extramarital Affai In Nizamabad - Sakshi

నిజామాబాద్ (ఎల్లారెడ్డి): వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని మైనర్‌కు హత్య చేసిన ఘటన మండలంలోని మేడిపల్లి జీపీ పరిధిలోగల హన్మంతు తండాలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్సై సాయిరెడ్డి తెలిపిన వివరాలు ఇలా.. తండాకు చెందిన జోగిని లక్ష్మి, తన అక్క కొడుకు రాజు (16)తో కలిసి ఉంటోంది. రాజు తల్లిదండ్రులు కొంతకాలం క్రితం మృతిచెందారు. దీంతో రాజు తన చిన్నమ్మ లక్ష్మి దగ్గర ఉంటూ పశువుల కాపరిగా పనిచేస్తు న్నాడు. లక్ష్మి పలువురితో వివాహేతర సంబంధాలు నేర్పుతుంది.

సీతాయిపల్లి గ్రామానికి చెందిన కుర్మ మల్లయ్యతో కూడా వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీంతో తనకు ఆ కుర్రాడు అడ్డుగా ఉన్నాడని భావించింది. ఈక్రమంలో ఆదివారం రాత్రి అతడు నిద్రపోయిన తర్వాత పథకం ప్రకారం ప్రియుడితో కలిసి చీరతో ఉరి వేసి హతమర్చారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు సీఐ రామన్‌ ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement