12 ఏళ్ల క్రితం పెళ్లి.. భర్త అనుమానిస్తున్నాడని ఎంత పనిచేసింది.. | Woman Assasinate Her Husband In Karnataka | Sakshi
Sakshi News home page

సోదరుడు, బావతో కలిసి భర్త హత్య

Jun 30 2021 1:08 PM | Updated on Jun 30 2021 1:40 PM

Woman Assasinate Her Husband In Karnataka - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, మైసూరు(కర్ణాటక): అనుమానిస్తూ, తరచూ గొడవపడుతున్న భర్తను సోదరుడు, బావ సహాయంతో అడ్డు తొలగించుకుందో ఇల్లాలు. మైసూరు జిల్లాలోని నంజనగూడు తాలూకాలోని ఇబ్బాల గ్రామానికి చెందిన కెంపెశెట్టి (35) హత్యకు గురైన వ్యక్తి. ఇతని భార్య శశికళా, ఆమె సోదరుడు నాగేంద్ర, బావ రమేష్, మరొకరు అరెస్టయ్యారు. వీరికి 12 ఏళ్ల కిందట పెళ్లి కాగా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.

మూడేళ్ల కిందట మైసూరుకు వచ్చి కూలీ పనులు చేసేవారు. భార్య గార్మెంట్స్‌ పనికి వెళ్లేది. అనుమానంతో కెంపెశెట్టి తరచూ రగడ పెట్టుకునేవాడు. దీనిపై భార్యభర్తలు దాడులు చేసుకుని కేసులు పెట్టుకున్నారు. ఇటీవల జైలు నుంచి విడుదలైన కెంపెశెట్టిపై రాత్రివేళ నలుగురూ కత్తులతో దాడి చేసి చంపేశారు. విజయనగర పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు.   

చదవండి: ఒక మహిళ ఎంతమందినైనా పెళ్లి చేసుకోవచ్చు! 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement