Wife Assassinated Husband Over Extramarital Affair In Karnataka - Sakshi
Sakshi News home page

Extramarital Affair: పక్కింటి మహిళ ఇంట్లోకి రావడంతో..

Mar 30 2022 6:34 AM | Updated on Mar 30 2022 9:49 AM

Wife Assassinated Husband Over Extramarital Affair Karnataka - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

దొడ్డబళ్లాపురం(బెంగళూరు): ఈనెల 23న దొడ్డ తాలూకా జక్కసంద్ర గ్రామంలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భార్యే భర్తను కడతేర్చినట్లు తెలిసింది. హనుమయ్య తన ఇంట్లోనే ఈనెల 23న హత్యకు గురయ్యాడు. తలపై బండరాయితో బాది హత్య చేశారు. హతుడి భార్య భాగ్య (30) మొదట తన భర్తను ఎవరో హత్య చేసారని నాటకమాడింది.

భర్తను హత్య చేసిన భాగ్య 24 గంటలపాటు శవంతోనే ఇంట్లో గడిపింది. పక్కింటి మహిళ ఇంట్లోకి రావడంతో హత్య సంగతి వెలుగు చూసింది. హనుమయ్య, భాగ్యకు 14 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. హొసకోట అట్టూరు గ్రామానికి చెందిన భాగ్య స్థానికంగా ఉన్న నాగేశ్‌ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలుసుకున్న హనుమయ్య భార్యతో గొడవపడ్డాడు. అయితే ఇరువైపుల పెద్దలు పంచాయతీ చేసి రాజీ కుదిర్చారు. అయినా భార్యభర్తలు నిత్యం గొడవపడేవారు. ఈ క్రమంలో భాగ్య, నాగేశ్, ఇతడి స్నేహితుడు నారాయణస్వామితో కలిసి హనుమయ్యను హత్య చేసింది. కేసుకు సంబంధించి దొడ్డ పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేసారు.

చదవండి: 45 వెడ్స్‌ 25.. నాడు వైరల్‌గా మారింది.. నేడు విషాదంతో ముగిసింది


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement