రోడ్డు ప్రమాదంలో స్నేహితుల దుర్మరణం

Two Youths Deceased In Bheemili Road Accident Visakhapatnam - Sakshi

రోడ్డు ప్రమాదంలో స్నేహితుల దుర్మరణం

సాక్షి, విశాఖపట్నం: అప్పటి వరకు స్నేహితుడి పుట్టిన రోజు వేడుకల్లో ఆనందంగా గడిపారు. అక్కడకు కొద్ది సేపటికే రోడ్డు ప్రమాదానికి గురై అనంతలోకాలకు వెళ్లిపోయారు. జాతీయ రహదారిపై విశాఖ కన్వెన్షన్‌ సెంటర్‌ ఎదురుగా మంగళవారం రాత్రి ఒంటి గంటన్నర ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు స్నేహితులు దుర్మరణం పాలయ్యారు. పీఎంపాలెం ఎస్‌ఐ శ్రీనివాసరావు తెలిపిన వివరాలివీ.. స్వతంత్రనగర్‌కు చెందిన వినోద్‌ ఖన్నా డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగ వేటలో ఉన్నాడు.

చదవండి: (ఆ ప్రేమికుల్ని బలవంతంగా బంధించి.. పూలు చల్లి, పెళ్లి చేసి.. యువతి శరీరంపై..)

మారికవలస న్యూ శారదా కాలనీకి చెందిన పల్లా ధనరాజ్‌ బీటెక్‌ పూర్తి చేసి ప్రముఖ సంస్థలో పనిచేస్తున్నాడు. వీరిద్దరూ మంగళవారం సాయంత్రం పనోరమ హిల్స్‌లో మరో స్నేహితుడి పుట్టినరోజు పార్టీకి వెళ్లారు. అర్ధరాత్రి దాటిన తర్వాత కొమ్మాది వచ్చి బంకులో పెట్రోల్‌ వేయించి.. తిరిగి నగరం వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో ముందు వెళ్తున్న లారీని ద్విచక్రవాహనంతో ఢీకొట్టి ప్రమాదానికి గురయ్యారు. సంఘటన స్థలంలోనే ఇద్దరూ మృతి చెందారు. వినోద్‌ఖన్నా సోదరుడు అరవింద్‌ ఖన్నా ఫిర్యాదు మేరకు పీఎంపాలెం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

చదవండి: ('నూటొక్క జిల్లాల అందగాడు': విగ్గుతో అమ్మాయిలకు వలేస్తాడు.. ఆ తర్వాత..)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top