బ్రేకింగ్: లిఫ్ట్ ఇచ్చి మహిళపై అఘాయిత్యం

గన్నవరం: నడుచుకుంటూ వెళ్తున్న మహిళకు లిఫ్ట్ ఇస్తానని చెప్పి బైక్ ఎక్కించుకున్న ఇద్దరు వ్యక్తులు కొద్దిసేపటికి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా గన్నవరం మండలం తెంపల్లిలో చోటుచేసుకుంది. ఆత్కూరు పోలీసుల వివరాల ప్రకారం.. బల్లిపర్రు నుంచి తెంపల్లికి ఓ మహిళ వెళ్తోంది. మార్గమధ్యలో బైక్‌పై ఇద్దరు వచ్చి లిఫ్ట్ ఇస్తామని ఆమెను ఎక్కించుకున్నారు. కొద్దిసేపటి అనంతరం ఆమెపై ఆ ఇద్దరు అత్యాచారానికి పాల్పడ్డారు. వారి బారి నుంచి తప్పించుకున్న అనంతరం బాధితురాలు ఆత్కూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వైద్య పరీక్షల కోసం ఆమెను విజయవాడలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి