 
													సాక్షి, హైదరాబాద్: కూకట్‌పల్లిలో ఓ జోమాటో డెలివరీ బాయ్ మీద ఇద్దరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. శుక్రవారం అతను విధులు నిర్వహించుకొని ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో తమ కారుకు అడ్డుగా వచ్చాడని ఇద్దరు వ్యక్తులు కోపంతో దాడి చేశారు. దాడికి గురైన బాధితుడు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్‌లో లభించిన కారు నెంబర్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
