Hyderabad: ముగ్గురు ఇంజినీరింగ్‌ విద్యార్థుల దుర్మరణం | Three Engineering Students Died In Road Accident At Dundigal, More Details Inside | Sakshi
Sakshi News home page

Hyderabad: ముగ్గురు ఇంజినీరింగ్‌ విద్యార్థుల దుర్మరణం

Jul 20 2024 11:21 AM | Updated on Jul 20 2024 12:05 PM

three engineering students in road accident

దుండిగల్‌: అతివేగం ముగ్గురు విద్యార్థుల ప్రాణాలను బలిగొంది. మితిమీరిన వేగంతో వచ్చిన కారు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో ముగ్గురు ఇంజినీరింగ్‌ విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన దుండిగల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది.

 పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాచుపల్లిలోని వీఎన్‌ఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన అక్షయ్, అస్మిత్, జస్వంత్, నవనీత్‌తో పాటు మరో స్నేహితుడు హరి కారులో దుండిగల్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు ఎగ్జిట్‌–5 వద్ద దిగారు. అక్కడి నుంచి సరీ్వస్‌ రోడ్డులో బౌరంపేట వైపు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లారీని వీరు ప్రయాణిస్తున్న కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్షయ్, హరి, అస్మిత్‌ అక్కడికక్కడే మృతి   చెందారు.

 తీవ్రంగా గాయపడిన జస్వంత్, నవనీత్‌లను సూరారంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన విద్యార్థుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. విద్యార్థులు నడిపిన కారుపై ఇప్పటికే అయిదు చలాన్లు నమోదయ్యాయి. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

 

Advertisement
 
Advertisement
Advertisement