ప్రలోభాలతో ఓటర్లకు టీడీపీ ఎర

TDP Leaders Arrested In Guntur District - Sakshi

పోలీసుల అదుపులో పలువురు నేతలు

నగరంపాలెం(గుంటూరు): పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఓటర్లకు స్టీల్‌ గిన్నెలను పంపిణీ చేసేందుకు సిద్ధమైన నలుగురిని అరెస్టు చేసినట్లు గుంటూరు అర్బన్‌ జిల్లా ఎస్పీ ఆర్‌.ఎన్‌.అమ్మిరెడ్డి తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..ఈ నెల 19వ తేదీన మేడికొండూరు గ్రామ పంచాయతీలోని ఇంద్రియానగర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద గుంటూరు–హైదరాబాద్‌ రాష్ట్ర రహదారిపై దక్షిణ జోన్‌ డీఎస్పీ జెస్సీ ప్రశాంతి, సీఐ ఎన్‌.మహతి సిబ్బందితో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 400 స్టీల్‌ గిన్నెలను గుర్తించి దర్యాప్తు వేగవంతం చేశారు. టీడీపీ సానుభూతి పరులుగా గుర్తింపు పొందిన ఇంద్రియానగర్‌ వాసులు బద్దెపోగు శివప్రసాద్, పెడిపాగా లూర్ధు, చెరుకూరి చెంచయ్య, చెరుకూరి లాజర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. నేరం రుజువు కావడంతో ఆ నలుగురిని అరెస్టు చేసి, 400 స్టీలు గిన్నెలను స్వాధీనం చేసుకున్నారు. కాగా, అరెస్టయిన నలుగురిలో ఒకరైన బద్దెపోగు శివప్రసాద్‌ అభ్యర్థి. గ్రామ పంచాయతీలోని 10వ వార్డు ఓటర్లకు పంపిణీ చేసేందుకు వాటిని తెచ్చారు.  సీజ్‌ చేసిన గిన్నెలను అర్బన్‌ ఎస్పీ పరిశీలించారు.

చీరలు పంచుతూ పట్టుబడిన టీడీపీ
తోటపల్లిగూడూరు:  శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా తోటపలి్లడూగూడూరు మండలం పోట్లపూడి పంచాయతీకి టీడీపీ మద్దతిచ్చిన  సర్పంచ్‌ అభ్యర్థి నాశిన కల్పన తరఫున  శనివారం రాత్రి గ్రామంలో ఓటర్లకు చీరలను పంచిపెట్టారు.   ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అజ్మతుల్లాఖాన్,ఎస్‌ఐ ఇంద్రసేనారెడ్డి  సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించి 34 చీరలు, రెండు మోటారు బైక్‌లు,కరపత్రాలను స్వాధీనం చేసుకుని ఇద్దరు టీడీపీ నేతలపై కేసు నమోదు చేశారు. 

టీడీపీ, జనసేన చీరలు, డబ్బు పంపిణీ !
పెదకాకాని(పొన్నూరు): పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలు బలపరచిన అభ్యర్థులకు ఓట్లు వేయాలని కోరుతూ డబ్బు, చీరలు పంపిణీ చేస్తున్న కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా పెదకాకాని మండల పరిధిలోని ఉప్పలపాడు గ్రామంలో టీడీపీ కార్యకర్తలు ఓటుకు రూ.1000 చొప్పున డబ్బు పంపిణీ చేయడంతో పాటు ఆ పార్టీ బలపరచిన అభ్యర్థులకు సంబంధించిన కరపత్రాలు, నగదు పంపిణీ చేస్తుండగా పోలీసులు స్టేషన్‌కు తరలించారు. వారిలో మున్నంగి నాగరాజు, కాకాని అన్వేష్‌కుమార్, మున్నంగి నాగప్రసాద్‌ ఉన్నారు. గోళ్ళమూడి గ్రామంలో జనసేన బలపరచిన వార్డు అభ్యర్థి పసుపులేటి శ్రీనివాసరావు చీరలు పంపిణీ చేస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

ఓట్ల లెక్కింపులో అవకతవకలపై ఆర్‌వోకు నోటీసులు
కారంచేడు: పంచాయతీ ఎన్నికల లెక్కింపుల్లో అవకతవకలు జరిగాయని ప్రకాశం జిల్లా కారంచేడు గ్రామ సర్పంచ్‌ అభ్యర్థి, వైఎస్సార్‌సీపీ సానుభూతి పరురాలు  కుంబా సుజాత ఎస్‌ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో రిటర్నింగ్‌ అ«ధికారి లింగరాజు సుధాకరరావుతో పాటు సిబ్బందికి ఈ నెల 24వ తేదీన ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసినట్లు తహసీల్దారు సీతారత్నం, ఎంపీడీవో ఎం.నాగభూషణరావు తెలిపారు.
చదవండి: నాలుగో దశ: పెనుగొలనులో టీడీపీకి ఎదురుదెబ్బ  
జెడ్పీ అధికారులపై టీడీపీ నేతల దౌర్జన్యం

 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top