
బిడ్డ పుట్టిన విషయం కూడా చెప్పకపోవడంతో హోంగార్డు మనస్తాపం.. ఆత్మహత్య
తిరువళ్లూరు/చెన్నై: భార్య తీరుతో మనస్తాపం చెంది కడంబత్తూరు యూనియన్ పుదుపట్టు గ్రామానికి చెందిన నటరాజన్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతడికి తిరునిండ్రవూర్‌కు చెందిన యువతితో గత ఏడాది వివాహమైంది. భార్యభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో విడిగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో వారం క్రితం జ్యోతికి ఆడబిడ్డ పుట్టింది.
అయితే బిడ్డ పుట్టిన విషయాన్ని చెప్పకపోవడంతో నటరాజన్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈనెల 21న పెళ్లిరోజు కావడంతో భార్యకు కాల్ చేశాడు. ఆమె తీయకపోవడంతో కలత చెంది ఆదివారం రాత్రి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
వివాహిత దారుణహత్య
తిరువొత్తియూరు: పుదుచ్చేరి విల్లియనూర్‌కు చెందిన బాల భాస్కరన్ భార్య ఆరోగ్య మేరి (31) ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తోంది. ఈ నెల 19వ తేదీ ఆస్పత్రికి వెళ్లిన ఆమె ఇంటికి రాలేదు. ఫిర్యాదు మేరకు విల్లియనూరు పోలీసులు ఆరోగ్యమేరితో పాటు పని చేస్తున్న డ్రైవర్ రమేష్‌ను విచారించారు. తనే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. అతనిచ్చిన సమాచారంతో గొనె సంచుల్లో ముక్కలుగా ఉన్న మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
చదవండి: chicken: భర్త చికెన్ తిన్నాడని క్షణికావేశంలో భార్య ఆత్మహత్య