దారుణం: పరీక్ష కోసం వచ్చిన యువతిపై..

Student Out to Write Exam Shot Dead Near Her College in Jaipur - Sakshi

జైపూర్‌ : పరీక్ష నిమిత్తం ఇంటి నుంచి బయటకు వచ్చిన విద్యార్థి విగత జీవిగా మారింది. కళాశాల సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి జరిపిన విచక్షణ రహిత కాల్పుల్లో హత్యకు గురై ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన శనివారం రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. ఝున్‌ఝనూ జిల్లాకు చెందిన యువతికి ఇటీవల ఇంటర్మీడియట్‌ ఫైనల్‌ ఇయర్‌ పరీక్ష ఉన్నందున ఇంటి నుంచి బయలుదేరి రాజపార్క్ ప్రాంతంలోని తన కళాశాలకు చేరుకుంది. ఉదయం 7 గంటల నుంచి 10 వరకు పరీక్ష రాసి బయటకు రాగా అదే సమయంలో ఓ వ్యక్తి యువతిపై కత్తితో దాడి చేసి ఆమెపై కాల్పులు జరిపాడు. (హేమంత్ రిమాండ్‌లో సంచలన విషయాలు)

ఈ ప్రమాదంలో గాయపడిన యువతిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆమె మరణించింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడు ధోల్పూర్‌కు చెందిన విష్ణుగా గుర్తించిన పోలీసులు అతను జైపూర్‌లో పోటీ పరీక్షకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. వెంటనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే హత్యకు గల కారణం ఇంకా స్పష్టంగా తెలియదని, దీనిపై మరింత దర్యాప్తు జరుగుతోందని వారు తెలిపారు. (కలకలం రేపిన పరువు హత్య)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top