Former TMC MP KD Singh Arrested By ED In Money Laundering Case | మాజీ ఎంపీ, వ్యాపారవేత్తకు ఈడీ షాక్‌ - Sakshi
Sakshi News home page

రాజ్యసభ ఎంపీ, వ్యాపారవేత్తకు ఈడీ షాక్‌

Jan 13 2021 3:15 PM | Updated on Jan 13 2021 5:47 PM

Former Rajya Sabha MP KD Singh arrested by ED  - Sakshi

తృణ‌మూల్ కాంగ్రెస్ మాజీఎంపీ కన్వర్ దీప్ సింగ్‌ను మనీలాండరింగ్‌ ఆరోపణల కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైర‌క్ట‌రేట్  (ఈడీ) బుధవారం అరెస్ట్‌ చేసింది.

సాక్షి,ముంబై: వ్యాపారవేత్త, తృణ‌మూల్ కాంగ్రెస్‌ మాజీనేత, రాజ్యసభ ఎంపీ కేడీ సింగ్‌ ఈడీ షాకిచ్చింది. మనీలాండరింగ్‌ ఆరోపణల కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైర‌క్ట‌రేట్  (ఈడీ) కన్వర్ దీప్ సింగ్‌ను  బుధవారం అరెస్ట్‌ చేసింది. పీఎంఎల్ఏ చ‌ట్టం కింద ఆయ‌న్ను అదుపులోకి తీసుకున్న‌ట్లు ఈడీ  వెల్లడించింది.1900 కోట్ల  రూపాయల పోంజీ చిట్ ఫండ్ స్కీం  స్కాం కేసు దర్యాప్తులో ఈ అరెస్టు చోటు చేసుకుంది. 

ఆల్‌కెమిస్ట్ ఇన్ఫ్రా  రియాల్టీ లిమిటెడ్‌తో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేడీ సింగ్‌పై 2016లో ఈడీ  కేసు నమోదు చేసింది.  చిట్ ఫండ్ స్కీమ్‌ ద్వారా అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించిన ఆయన ఇల్లు,ఆఫీసులపై  గతంలో ఈడీ సోదాలు నిర్వహించింది.  2019 జనవరిలో ఆల్‌కెమిస్ట్ ఇన్‌ఫ్రా సంస్థ‌కు చెందిన  రూ. 239 కోట్ల ఆస్తుల‌ను ఈడీ ఎటాచ్‌ చేసింది.   చిట్‌ఫండ్‌ పేరుతో సుమారు 1916 కోట్ల నిధుల‌ను మూడేళ్ల‌లో సేక‌రించిందనేది ప్రధాన ఆరోపణ. అయితే  సుమారు రూ.1077 కోట్లు తిరిగి చెల్లించినట్లు 2015లో   సంస్థ సెబీకి తెలిపింది. మిగిలిన మొత్తాన్ని తిరిగి ఇవ్వడానికి మరికొంత సమయం కోరింది. అయితే  ఈ ప్రతిపాదనను తిరస్కరించిన సెబీ  2016 మార్చిలో ఈ కేసులో చార్జిషీట్ దాఖలు చేసింది. అటు  నారద స్టింగ్ ఆపరేషన్‌  కేసులో కూడా కేడీ సింగ్‌ను సీబీఐ ప్రశ్నించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement