రోడ్డుపై గుంతను తప్పించబోయి ట్రక్కును ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి | Sakshi
Sakshi News home page

రోడ్డుపై గుంతను తప్పించబోయి ట్రక్కును ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి

Published Sun, Jan 8 2023 6:12 PM

Palghar Car Dashes Into Container Truck To Avoid Potholes - Sakshi

ముంబై: మహారాష్ట్ర పాల్ఘర్‌లో ఆదివారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డుపై గుంతను తప్పించబోయిన ఓ కారు ముందున్న కంటైనర్ ట్రక్కును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఒకే కుటుంబానికి చెందిన వీరంతా ఫంక్షన్‌కు వెళ్తుండగా ఈ విషాదం జరిగింది.

ప్రమాదానికి గురైన కారు వాగన్ఆర్. పాల్గర్‌లోని చరోతి సమీపంలో ఉ‍న్న బ్రిడ్జిపై ఆదివారం మధ్యాహ్నం 1:15 గంటలకు ఈ ఘటన జరిగింది. మృతులను నరోత్తమ్ ఛనా రాథోడ్(65), కేతన్ నరోత్మ రాథోడ్‌(35), ఏడాది బాలుడు ఆర్వి దీపేశ్ రాథోడ్‌గా గుర్తించారు. వీరంతా భిలాడ్‌లో ఓ శుభకార్యానికి వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యారు. గాయపడ్డ నలుగురిని వేదాంత ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
చదవండి: వృద్ధ మహిళలే టార్గెట్.. హత్యలతో హడలెత్తిస్తున్న సీరియల్ కిల్లర్

Advertisement
 
Advertisement