ఆ 3 గంటల్లోనే మృత్యు ఘంటికలు | Sakshi
Sakshi News home page

ఆ 3 గంటల్లోనే మృత్యు ఘంటికలు

Published Sun, Dec 17 2023 4:31 AM

Most road accidents occur between 6pm and 9pm - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల మధ్యే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ మూడు గంటల్లోనే ప్రమాదాలు అత్యధికంగా నమోదవుతున్నట్లు నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ)–2022 నివేదిక వెల్లడించింది. 2022లో దేశవ్యాప్తంగా 4,46,768 రోడ్డు ప్రమాదాలు నమోదుకాగా.. ఈ మూడు గంటల్లోనే 90,663 ప్రమాదాలు జరిగినట్టు నివేదిక తెలిపింది.

అదే సమయంలో తెలంగాణలో 4,544 రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయి. కార్యాలయాల పనివేళలు ముగించుకుని ఇళ్లకు వెళ్లేవారు, పలు రకాల పనులపై ఇంటి నుంచి బయటికి వచ్చే వాహనదారులతో రోడ్లు రద్దీగా ఉండటం... సాయంత్రం వేళల్లో సరైన వెలుతురు లేకపోవడం, వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు తదితర కారణాలతోనే సాయంత్రం 6 నుంచి 9 గంటల మధ్య రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్టు రోడ్డు భద్రత నిపుణులు చెబుతున్నారు. 

1/1

Advertisement
 

తప్పక చదవండి

Advertisement