Depressed Over Not Getting Job Medical Student Committed Suicide In Boinpalli - Sakshi
Sakshi News home page

ఉద్యోగం రాలేదన్న బెంగతో ఎంబీబీఎస్‌ విద్యార్థి ఆత్మహత్య

Feb 20 2021 1:59 PM | Updated on Feb 20 2021 3:27 PM

Medical Student Ends Life Due To Depression In Hyderabad - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

రాము శరణ్‌ ఇంటికి వెళ్లే సరికి లాక్‌ వేసి ఉంది. కిటికీ లోంచి చూడగా చరణ్‌ ఉరి వేసుకుని కనిపించాడు.

కంటోన్మెంట్‌: ఎంబీబీఎస్‌ చదివినప్పటికీ సరైన ఉద్యోగం రాకపోవడంతో మనస్తాపానికి గురైన ఎంబీబీఎస్‌ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన బోయిన్‌పల్లి పీఎస్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓల్డ్‌ బోయిన్‌పల్లి లోని సాయి రెసిడెన్సీలో నివాసం ఉంటున్న ఎంబీబీఎస్‌ విద్యార్థి శరన్‌ ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన అనంతరం ఎంఎస్‌ చేసేందుకు సిద్ధమయ్యాడు. శరన్‌ తన విద్యా ధ్రువపత్రాల కోసం నెల్లూరు నుంచి హైదరాబాదులోని జీడిమెట్లలో ఉండే తన మిత్రుడు రాము ఇంటికి వచ్చి సాయంత్రం వరకూ గడిపినట్లు పోలీసులు తెలిపారు.

అనంతరం అతను తిరిగి ఓల్డ్‌ బోయిన్‌పల్లిలోని తన నివాసానికి వెళ్లిపోయాడు. చరణ్‌ తల్లి అతనికి ఫోన్‌ చేయగా స్విచ్చాఫ్‌ రావడంతో రాముకి సమాచారం అందించింది. రాము శరణ్‌ ఇంటికి వెళ్లే సరికి లాక్‌ వేసి ఉంది. కిటికీ లోంచి చూడగా చరణ్‌ ఉరి వేసుకుని కనిపించాడు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మానసిక ఇబ్బందులు, ఉద్యోగం రాలేదన్న దిగులుతో అతను ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

చదవండి:
విద్యుత్‌ వైరు మీద పడి స్విగ్గీ డెలివరీ బాయ్‌ మృతి
ట్రాన్స్‌జెండర్‌తో పెళ్లి.. కట్నంకోసం వేధింపులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement