ఆ బాలిక ఖరీదు.. రూ.13 లక్షలు? 

Man Cheated Girl In The Name Of Love Narsampet Settlemet For 13 lakhs - Sakshi

సాక్షి, వరంగల్‌: ప్రేమపేరుతో నమ్మించి.. ఆపై వంచించిన నిందితుడిపై బాలిక ఫిర్యాదుతో పోక్సో కేసు నమోదైంది. ఆ కేసును నీరుగార్చేందుకు మధ్యవర్తులుగా వ్యవహరించిన పెద్దలు గద్దలుగా మారారు. రూ.13 లక్షలు బాధితురాలి కుటుంబానికి ఇచ్చేలా తీర్మానం చేసి.. భారీగానే నొక్కేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీస్‌ అధికారి సమక్షంలోనే ఈ సెటిల్‌మెంట్‌ జరిగిందన్న విషయం నర్సంపేటలో చర్చనీయాంశమైంది. బాధితురాలిపై ఒత్తిడి పెరగడంతో.. ఆమె వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ రంగనాథ్‌ను కలిసి న్యాయం చేయాలని కోరినట్టు సమాచారం.

నర్సంపేట పట్టణానికి చెందిన ఓ యువకుడు.. పట్టణానికి సమీపంలో ఉండే ఓ తండాకు చెందిన 16 ఏళ్ల బాలికను ప్రేమిస్తున్నానని నమ్మించాడు. బాలిక తల్లిదండ్రులు ఉపాధి కోసం హైదరాబాద్‌లో ఉంటుండడంతో ఈమె తరచూ వస్తూ, వెళ్తుండేది. ఈ క్రమంలోనే ప్రేమపేరుతో ఆమెకు దగ్గరైన యువకుడు హైదరాబాద్‌కు వెళ్లి మరీ కొంతకాలం కలిసి ఉన్నాడు. ఆ తర్వాత మొహం చాటేయడంతో.. బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2022 ఆగస్టు 14న యువకునిపై పోక్సో కేసు నమోదైంది.

అరెస్టయిన యువకుడు జైలుకెళ్లి బెయిల్‌పై బయటకొచ్చాడు. తర్వాత అబ్బాయి బంధువులు, అమ్మాయి బంధువులతో కేసు సెటిల్‌మెంట్‌కు ప్రయత్నాలు చేశారు. రూ.13 లక్షలు ఇచ్చేలా నిర్ణయించి.. ముందు రూ.5 లక్షలు, కేసు కాంప్రమైజ్‌ అయ్యాక మిగిలిన రూ.8 లక్షలు ఇచ్చేలా తీర్మానం రాశారు. బాలిక కుటుంబానికి రూ.2 లక్షలు ఇచ్చి, మిగిలిన మొత్తాన్ని పెద్దలే నొక్కేసినట్టు తెలు స్తోంది. ఈ వ్యవహారమంతా ఓ పోలీసు అధికారి సమక్షంలోనే జరిగిందని సమాచారం. ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న బా లిక.. న్యాయం కోసం కమిషనర్‌ను ఆశ్రయించినట్టు సమాచారం. 
చదవండి: ఒక్క రోజులో సినిమా, ఇంధన కొరతకు చెక్‌.. ఏఐతో ఏదైనా సాధ్యమే!

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top