ప్రమాదమా.. తగలబెట్టారా?

Man Burned Alive In Car In Medak District - Sakshi

కారులో వ్యక్తి సజీవ దహనం

ఘటనా స్థలం వద్ద పెట్రోల్‌ బాటిల్‌ లభ్యం

హత్య వెనక కుట్ర ఏమైనా ఉందా? అని పోలీసుల దర్యాప్తు

మృతుడు మెదక్‌ జిల్లా బీమ్లాతండాకు చెందిన ధర్మాగా గుర్తింపు

రాష్ట్ర సచివాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా విధులు

టేక్మాల్‌(మెదక్‌): కారులో ఓ వ్యక్తిని సజీవ దహనం చేసిన ఘటన మెదక్‌ జిల్లా టేక్మాల్‌ మండలం వెంకటాపూర్‌ గ్రామ శివారులో చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ జరపగా కారులో దహమైన వ్యక్తిని వెంకటాపూర్‌ పంచాయతీ పరిధిలోని బీమ్లాతండాకు చెందిన పాత్‌లోత్‌ ధర్మానాయక్‌గా గుర్తించారు. అల్లాదుర్గం సీఐ జార్జ్‌ కథనం ప్రకారం.. పాతులోత్‌ ధర్మానాయక్‌ (48) రాష్ట్ర సచివాలయంలోని ఇరిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌లో సీనియర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

ఈ నెల 5వ తేదీన ఆయన కుటుంబ సభ్యులతో కలసి స్వగ్రామం వచ్చారు. 6వ తేదీన తన మిత్రులతో కలసి బాసరకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయలుదేరారు. ఆదివారం రాత్రి భార్యకు ఫోన్‌ చేసి ఇంటికి వస్తున్నానని చెప్పారు. ఈ క్రమంలో సోమ వారం ఉదయం గ్రామ శివారులోని చెరువు కట్ట కింది భాగంలో దహనమైన కారులో ఓ వ్యక్తి మృతదేహం ఉన్నట్టు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పోలీ సులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అక్కడ ఉన్న దు స్తులు, బ్యాగు ఆధారంగా మృతుడిని పాతు లోత్‌ ధర్మానాయక్‌గా గుర్తించారు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడి భార్య నీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

కారులో ధర్మానాయక్‌ సజీవ దహనమైన చోట పెట్రోల్‌ బాటిల్‌ పడి ఉండటంతో ఎవ రైనా కుట్రతో హత్య చేసి, కారులో పడేసి తగలబెట్టారా.. లేదా ఏదైనా ప్రమాదామా? అనే కోణంలో దర్యాప్తు చేస్తు న్నారు. ఎస్పీ రోహిణీ ప్రియదర్శిని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇద్దరు కూతుళ్లు జార్ఖండ్‌లోని ఐఐటీలో విద్యన భ్యసిస్తున్నారు. కుమారుడు హైదరాబాద్‌లో ఇంజనీరింగ్‌ సెకండ్‌ ఇయర్‌ చదువుతున్నట్లు స్థానికులు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top