
40 మంది పిల్లలతో వెళ్తున్న ప్రైవేటు స్కూల్ బస్సు చంద్రాపూర్ గ్రామం సమీపంలో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోగా.. మరో 15 మంది గాయపడ్డారు.
భోపాల్: మధ్యప్రదేశ్ సాగర్ జిల్లా రహత్‌గఢ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. 40 మంది పిల్లలతో వెళ్తున్న ప్రైవేటు స్కూల్ బస్సు చంద్రాపూర్ గ్రామం సమీపంలో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోగా.. మరో 15 మంది గాయపడ్డారు. తీవ్రగాయాలపాలైన ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది.
క్షతగాత్రులు జిల్లా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్, యజమానిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పేర్కొన్నారు.
అయితే డ్రైవర్ ఫోన్ మాట్లాడుతూ నిర్లక్ష‍్యంగా బస్సు నడపడం వల్లే ప్రమాదం జరిగిందని అందులోని విద్యార్థులు తెలిపారు. తమ తోటి విద్యార్థి మృతితో శోకసంద్రంలో మునిగిపోయారు.
చదవండి: పీఎఫ్‌ఐపై రెండో విడత దాడులు.. కర్ణాటకలో 45 మంది అరెస్టు