సార్.. మా అక్కను బావే చంపాడు

Hyderabad: Brother Complaint Lodged On Brother In Law For Assassination His Wife - Sakshi

సాక్షి, బాలానగర్‌( హైదరాబాద్): తన అక్కను ఆమె భర్తే చంపాడంటూ ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ ఎండీ. వాహిదుద్దీన్‌ వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్‌ జిల్లా అలంపూర్‌కు చెందిన కొమరయ్య, దేవమ్మ దంపతులు తమ ముగ్గురు పిల్లలతో కలిసి బాలానగర్‌లోని ఐడీపీయల్‌ గుడిసెల్లో ఉంటున్నారు. అయితే ఈ నెల 10వ తేదీన అనారోగ్యంతో దేవమ్మ (45), మృతి చెందగా బంధువుల సమక్షంలో అంత్యక్రియలు పూర్తి చేశారు.

సోమవారం దేవమ్మ తమ్ముడు రాములు తన అక్కను బావే చంపాడని ఆరోపిస్తూ ఫిర్యాదు చేయగా.. మృతురాలి కొడుకులు, చెల్లెలు మాత్రం అనారోగ్యంతోనే దేవమ్మ మృతి చెందినట్లుగా చెబుతున్నారని పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top