బంధువుతో ఇష్టం లేని పెళ్లి.. ఇంట్లో ఎవరు లేని సమయంలో.. | Girl Ends Her Life Pour Kerosene On Body Tamil Nadu | Sakshi
Sakshi News home page

బంధువుతో ఇష్టం లేని పెళ్లి.. ఇంట్లో ఎవరు లేని సమయంలో..

Nov 29 2021 11:36 AM | Updated on Nov 29 2021 12:02 PM

Girl Ends Her Life Pour Kerosene On Body Tamil Nadu - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి,తిరువొత్తియూరు( చెన్నై): శరీరంపై కిరోసిన్‌ పోసుకుని విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శ్రీపెరంబదూర్‌లో జరిగింది. సందవేలూరు శ్రీనివాస పెరుమాల్‌ ఆలయం వీధికి చెందిన రమేష్‌ టాస్మాక్‌ దుకాణంలో పనిచేస్తున్నాడు. అతనికి భార్య ధనలక్ష్మి, కుమార్తె మోహన ప్రియ (18) ఉన్నారు. మోహనప్రియ కాంచీపురంలోని ప్రైవేట్‌ కళాశాలలో బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో రమేష్‌ కుటుంబంతో కలిసి అన్న సెల్వరాజ్‌ ఇంటికి వెళ్లాడు.

మోహన ప్రియ తాను ఇంటికి వెళుతున్నట్లు తల్లిదండ్రులకు చెప్పింది. ఇంటికి వచ్చిన తర్వాత ఏమి జరిగిందో కాని శరీరంపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుంది. మంటలు తాళలేక ఆమె కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు వచ్చి మంటలను ఆర్పి 108 ద్వారా శ్రీపెరంబుదూర్‌ ఆస్పత్రిలో చేర్చారు. పరిశీలించిన డాక్టర్లు విద్యార్థిని అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. సుంగువారిసత్రం పోలీసులు కేసు దర్యాప్తుచేపట్టారు. మోహన ప్రియకు బంధువుతో ఇష్టం లేని పెళ్లి చేయడానికి ఏర్పాట్లు చేయడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది.

చదవండి: Kukatpally Rave Party: సడన్‌గా పోలీసుల ఎంట్రీ, ఇద్దరు హిజ్రాలు కూడా..

 

Advertisement
 
Advertisement
Advertisement