ప్రేమిస్తున్నానంటూ వేధింపులు.. ఎయిర్‌గన్‌తో  | Fake Air Gun Man Halchal In Dammaiguda At Hyderabad | Sakshi
Sakshi News home page

ప్రేమిస్తున్నానంటూ వేధింపులు.. ఎయిర్‌గన్‌తో 

Feb 20 2021 6:54 AM | Updated on Feb 20 2021 11:10 AM

Fake Air Gun Man Halchal In Dammaiguda At Hyderabad - Sakshi

యువతి సోదరుడు భానుప్రకాశ్‌ను పద్మశాలి టౌన్‌షిప్‌కు పిలిపించి ఘర్షణ పడ్డాడు.

జవహర్‌నగర్‌:  ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన బొమ్మ తుపాకీతో ఓ యువకుడు బెదిరింపులకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం  రేపింది. ఈ ఘటన జవహర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని దమ్మాయిగూడ పద్మశాలి టౌన్‌షిప్‌లో శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఇన్‌చార్జి సీఐ మధుకుమార్‌ వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా ఇల్లందుకు చెందిన యువతి గీతాంజలి కళాశాలలో బీటెక్‌ చదువుతూ దమ్మాయిగూడ లేక్‌వ్యూ కాలనీలోని బంధువుల ఇంట్లో నివాసముంటోంది. దమ్మాయిగూడ సాయిబాబానగర్‌కు చెందిన అభిషేక్‌(20) అదే కళాశాలలో చదువుతూ యువతిని ప్రేమిస్తున్నానంటూ కొంత కాలంగా వేధింపులకు గురిచేస్తున్నాడు.

శుక్రవారం మధ్యాహ్నం యువతి సోదరుడు భానుప్రకాశ్‌ను పద్మశాలి టౌన్‌షిప్‌కు పిలిపించి ఘర్షణ పడ్డాడు. ఈ క్రమంలో తన దగ్గర ఉన్న ఎయిర్‌గన్‌తో బెదిరింపులకు పాల్పడ్డాడు. పోలీసులు అభిషేక్‌ను అదుపులోకి తీసుకుని ఎయిర్‌గన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అతడు ఉపయోగించిన ఎయిర్‌గన్‌ ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన బొమ్మతుపాకీ అని పోలీసులు నిర్ధారించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

చదవండి: వీడియో కాల్‌.. లైవ్‌లో దుస్తులిప్పి
చదవండి: పెళ్లి పేరుతో యువతిపై రెండేళ్లుగా లైంగిక దాడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement