‘హైడ్రా’ పేరిట వసూళ్లు..! వ్యక్తిపై కేసు నమోదు | Extortion In The Name Of Hydra Case Filed In Aminpur Ps | Sakshi
Sakshi News home page

‘హైడ్రా’ పేరిట వసూళ్లు..! వ్యక్తిపై కేసు నమోదు

Sep 4 2024 9:42 AM | Updated on Sep 4 2024 9:43 AM

Extortion In The Name Of Hydra Case Filed In Aminpur Ps

సాక్షి,సంగారెడ్డి: అమీన్‌పూర్‌లో హైడ్రా పేరిట బిల్డర్ల వద్ద నుంచి వసూళ్లకు యత్నించిన ఓ వ్యక్తిపై పోలిస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. బెదిరింపులకు పాల్పడుతున్న డాక్టర్ బండ్ల విప్లవ సిన్హా అనే వ్యక్తిపై బిల్డర్లు వాడల రాజేంద్రనాథ్, మంజునాథ్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. సోషల్ యాక్టివిస్ట్, సోషల్ వర్కర్ అని బోర్డు పెట్టుకొని కస్టమర్లకు తమ ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌తో దగ్గరి పరిచయం ఉందని, ఆయనతో కలిసి దిగిన ఫొటోలు చూపిస్తూ వాట్స్అప్ కాల్ చేసి బెదిరిస్తున్నాడని తెలిపారు. మీ జోలికి రావద్దు అంటే తనకు 20 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపించారు. బిల్డర్ల ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన అమీన్‌పూర్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement